బిక్కవోలులో 20 కాసుల బంగారం చోరీ
బిక్కవోలు: మండల కేంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గున్నం భవనమ్మ ఇంట్లో సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. ఈ ఘటనపై బిక్కవోలు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంట్లోని లాకర్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను బ్యాంకులో భద్రపరిచేందుకు తీసే సమయంలో అవి కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు గుర్తించినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇంటి తాళాలు పగలగొట్టిన ఆనవాళ్లు, తలుపులు, లాక్‌లు ధ్వంసమైన గుర్తులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కుటుంబ కార్యక్రమాల నేపథ్యంలో ఇటీవల...