POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 26 August 2026, 8:40 pm Posted by : POLITICAL POWER

 రూ 30,000 కోట్ల విలువైన 60 తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజీల భూముల కోసమే విలీనం కుట్ర?

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్

తెలంగాణలో వందేళ్ల క్రితమే నిజాం పాలనలో మొదలై విజయవంతంగా నడుస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలను ఎందుకు రేవంత్ రెడ్డి తన ఫెయిల్యూర్ వెంచర్ స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు?

గత రెండు వారాలుగా వేలాదిమంది పాలిటెక్నిక్ విద్యార్ధులు రోడ్ల మీదకెక్కి ఆందోళనలు చేస్తున్నా, వందలాది విద్యావేత్తలు వద్దు అంటున్నా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా అందోళన చేస్తున్నా, రేవంత్ మాత్రం మొండిపట్టు వీడటం లేదు.

దీని వెనుక ఉన్న ప్లాన్ ఏమిటి? తెలుగు స్క్రైబ్ ఈ అంశం మీద పరిశోధిస్తే దిమ్మతిరిగే సంగతులు బయటపడ్డాయి.

1923లో నిజాం హయాంలో మాసబ్‌ట్యాంక్ వద్ద తొలి పాలిటెక్నిక్ కాలేజీ ప్రారంభం అయ్యింది. ఇప్పుడు తెలంగాణలో సుమారు 60 పాలిటెక్నిక్ కాలేజీలు పేద, మధ్యతరగతి విద్యార్ధులకు ఉద్యోగకల్పనకు అవసరమైన వివిధ కోర్సులు చౌక ధరలో అందిస్తున్నాయి. ఇంజనీరింగ్  చేసిన విద్యార్ధుల కన్నా ఎక్కువగా పాలిటెక్నిక్ కోర్సులు చేసిన విద్యార్ధులకే తొందరగా ఉద్యోగాలు వస్తుండటం ఆ కాలేజీలు, కోర్సులు ఎంత అవసరమో నిరూపిస్తున్నాయి.

ఇప్పుడు రేవంత్ కన్ను వీటి మీద పడింది.

ఓవైపు తాను వందల కోట్లు ఖర్చు చేసి ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. మరోవైపు పచ్చగా ఉన్న పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న వేలకోట్ల భూమి మీద రేవంత్ కన్ను పడింది అని పాలిటెక్నిక్ కాలేజీల విద్యార్ధులు సంచలనాత్మక ఆరోపణలు చేస్తున్నారు. తెలుగు స్క్రైబ్ పరిశీలనలో పాలిటెక్నిక్ కాలేజీలకు ఉన్న భూములు అన్నీ ప్రధాన నగరాల్లో మెయిన్ రోడ్డును ఆనుకుని ఉన్నాయి అని, వీటి విలువ మొత్తం కలిపితే సుమారు రూ 30,000 కోట్లు ఉంటుంది అని తేలింది. ఇప్పుడు ఈ భూముల మీద కన్నేసే రేవంత్ ప్రభుత్వం  అర్జెంటుగా పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ప్రతిపాదన ముందుకు తెచ్చింది అని విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

ఉదాహరణకు మాసబ్‌ట్యాంక్‌లో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీకి నగరం నడిబొడ్డున వేలకోట్లు విలువచేసే భూమి ఉంది. అలాగే సికిందరాబాద్ పాలిటెక్నిక్ కాలేజీకి కూడా సుమారు అదే స్థాయిలో విలువైన పది ఎకరాల భూమి ఉంది. వరంగల్, నిజామాబాద్, నల్లగొండ ఇలా ప్రతి పెద్ద పట్టణంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీకి వందల కోట్ల విలువ చేసే భూమి ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్నది. ఇప్పుడు రేవంత్ కన్ను ఈ విలువైన భూముల మీద పడింది అని పాలిటెక్నిక్ విద్యార్ధులు ఆరోపిస్తున్నారు.

అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యాసంస్థల భూముల మీదనే రేవంత్ కన్ను ఉంది. తొలుత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని అమ్ముకోవాలనే ప్రయత్నం, ఆ తరువాత మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల విలువైన భూమిని గుంజుకోవాలనే ప్రయత్నం చేశాడు రేవంత్. రెండు సార్లు విద్యార్ధుల ఆందోళన వల్ల వెనక్కి తగ్గాడు.

ఇప్పుడు తాజాగా తన ఫెయిల్యూర్ వెంచర్ స్కిల్ యూనివర్సిటీలో విద్యార్ధులు లేక ఇజ్జత్ పోతుండటతో ఎలాగైనా దాన్ని నిలబెట్టేందుకు, అలాగే సుమారు రూ 30,000 కోట్ల విలువైన పాలిటెక్నిక్ కాలేజీల భూములను కాజేసేందుకే ఈ విలీనం కుట్ర పన్నాడు అని విద్యార్ధులు అంటున్నారు.రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతి అంశం భూముల చుట్టే తిరుగుతుండటం గమనార్హం! రెండో భాగం: వందల కోట్లు కుమ్మరించినా అట్టర్ ఫ్లాప్ అయిన స్కిల్ యూనివర్సిటీ భాగోతం.