*హర్షికేతన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కు ఘన ఆహ్వానం*
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి
*కలెక్టర్ దివాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూరపాటి సురేష్ చమార్*
హర్షికేతన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవానికి కలెక్టర్ కు ఆహ్వానం – అభినందించిన జిల్లా కలెక్టర్ దివాకర్*
మధిర లో సేవా కార్యక్రమాలే లక్ష్యంగా నూతనంగా ఏర్పాటు కానున్న *హర్షికేతన్ ఫౌండేషన్* ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ *శ్రీ దివాకర్ కి* ఘనంగా ఆహ్వానం పలికారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు *శ్రీ కూరపాటి సురేష్ చమార్ *.
ఈరోజు కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ దివాకర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, ఫౌండేషన్ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ద్వారా చేపట్టబోయే సేవా కార్యక్రమాలు, విద్య, వైద్య, సామాజిక సేవా లక్ష్యాలను కలెక్టర్ కి వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హర్షికేతన్ ఫౌండేషన్ సేవా ఆలోచనను అభినందిస్తూ, ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఎంతో అవసరమని, తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారని కూరపాటి సురేష్ చామారు గారు తెలిపారు.
అనంతరం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ “పేద విద్యార్థులకు చదువు, నిరుపేదలకు అండగా నిలవడం, సామాజిక చైతన్యమే లక్ష్యంగా హర్షికేతన్ ఫౌండేషన్ ను ప్రారంభిస్తున్నాం. ఖమ్మం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మాకు గర్వకారణం” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థాపకులు, హర్షికేతన్ ఫౌండేషన్* cell 90591 33918
