POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 10:02 am Posted by : POLITICAL POWER

పోలీస్‌ కొలువులకు ఉచిత శిక్షణ

 

*కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగార్థులకు అవకాశం

*ఆగస్టు 30లోగా దరఖాస్తుల సమర్పణ

*సెప్టెంబర్ 6న ప్రవేశ పరీక్ష

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్టు 27)

 

అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు పోలీస్‌ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించనున్నట్లు ఎస్సై టీ. యయాతి రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌ రాజు సూచనల మేరకు త్వరలో నిర్వహించనున్న పోలీస్‌ నియామక పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకుని సిద్ధమవుతున్న అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్సై సూచించారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు పత్రాన్ని పూర్తిగా నింపి ఈ నెల 30వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌లో సమర్పించాలని తెలిపారు.

 

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సెప్టెంబర్‌ 6న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎస్సై వెల్లడించారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి కల్పించి, పోలీస్‌ పోటీ పరీక్షలకు అవసరమైన అంశాలపై ప్రత్యేక శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. పోలీస్‌ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అశ్వారావుపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగాలని ఎస్సై యయాతి రాజు ఆకాంక్షించారు.