సెప్టెంబర్ 1,2,3 హలో యువత చలో నెల్లూరు.
DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు.
బద్వేల్ పొలిటికల్ పవర్ 9టీవీ తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) 16వ రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1,2,3 నెల్లూరు లో ఘనంగా జరగబోతున్నాయని యువత పాల్గొని జయప్రదం చేయాలని DYFI పోరుమామిళ్ల మండల అధ్యక్ష కార్యదర్శులు ఎం సుందరయ్య ఎం రత్తమయ్య లు తెలిపారు.గురువారం నాడు పోరుమామిళ్ల మండల కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువజనుల పోరాటాల వారధి ఉద్యమాల సారధి DYFI రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 1 2 3 తేదీలలో నెల్లూరు లో జరుగుతున్నాయని అన్నారు.మహాసభలలో రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పై చర్చిస్తామని అన్నారు.యువతకు ఉద్యోగ ఉపాధి కల్పననే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు.అందరికీ విద్యా అందరికీ ఉపాధి కోసం పోరాడుతున్నామని అన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసారు అన్నారు.రాష్ట్రంలో ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కల్పించాలని అన్నారు.స్థానిక పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేసారు.భూ నిర్వాసిత యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని అన్నారు.కడప ఉక్కు కు నిధులు విడుదల చేసి పరిశ్రమ త్వరగా పూర్తి కోసం చర్యలు చేపట్టాలని కోరారు.ఈ డిమాండ్లు అన్ని రాష్ట్ర మహాసభలలో చర్చించి కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు బాలు మండల నాయకులు సురేష్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
