POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 June 2026, 4:52 pm Posted by : POLITICAL POWER

2029లో టిడిపికి పూర్వవైభవం తీసుకురావాలి

– తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి, 
కార్యకర్తల కృషితో 2029లో తెలంగాణలో టిడిపి పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుంది,
– టిడిపి కొత్తకోట మండల పార్టీ అధ్యక్షులు ముడవత్ కిషన్ నాయక్ ,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి
న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 20.2026.
తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయని, కార్యకర్తల కృషితో 2029లో తెలంగాణలో టిడిపి పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని టిడిపి కొత్తకోట మండల పార్టీ అధ్యక్షులు ముడవత్ కిషన్ నాయక్
 అన్నారు. శనివారం కొత్తకోట పట్టణ చౌరస్తాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంలో టిడిపి కొత్తకోట మండల పార్టీ అధ్యక్షులు ముడవత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణలో  ప్రజలంతా టిడిపి నాయకుల కోసం ఎదరి చూస్తున్నారన్నారు. నేడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తే నవ్వోస్తుందని, జైలుకు పోయి వచ్చిన వారు కూడా రాష్ట్రంలో నూతనంగా పార్టీలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీ పది ఏళ్ల పాటు పాలించి రాష్ట్రాన్ని అప్పుల కుప్పుగా మార్చిందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి టిడిపితోనే సాధ్యమన్నారు. కార్యకర్తలకు ఎలాంటి భయం వద్దని.. 2029 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు ప్రజల్లో మంచి గౌరవం ఉందన్నారు. నేటి రాజకీయ పార్టీలను చూసిన  వారి పాలనను భరించలేక పోతున్నారన్నారు. పాలమూరు అంటేనే గతంలో టిడిపికి కంచుకోటని గుర్తుచేశారు. ఆంధ్ర పార్టీ అని ముద్రవేసి కుట్ర పూరితంగా తెలంగాణలో టిడిపి పార్టీ ప్రభావం తగ్గించారన్నారు. ప్రజల మేలు కొరేటిడిపి పార్టీ కోసం నేడు ప్రజలంత వేయి కళ్లతో ఎదిరి చూస్తున్నారని, కార్యకర్తలు మరోసారి ప్రజల మధ్యకు వెళ్లి పార్టీ సత్తా చాటుదారున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి మాల మాదిగల కోసం 46 ఆశ్రమ పాఠశాలలు కట్టిస్తే ఆ తరువాత క్రమంలో చంద్రబాబు నాయుడు వాటిని 294కు పంచారని గుర్తుచేశారు. టిడిపి పేదల పార్టీని, పేదున కర్తక, కార్మికులంతా టిడిపికి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనార్దన్ గౌడ్, వెంకట్ రమణ చారి, శ్రీరాములు నాయి, ఈశ్వరయ్య, టైలర్ బాబన్న, బి. శ్రీనివాస్ గౌడ్,వై.బండలయ్య, ప్రేమ దానం, బలరాం నాయక్, మాజీ ఉపసర్పంచ్ జనార్దన్ సాగర్, గంగాధర్, లక్ష్మయ్య, బాలరాజు,  రవికుమార్, ఒలియోద్దీన్, బలరాం, కొండన్న,  చంద్రాయుడు తదితరులు పాల్గొన్నారు.