లక్షెట్టిపేట కేంద్రంగా జనసేన బలోపేతానికి కార్యాచరణ ఆగష్టు 29: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్ లక్షెట్టిపేట: జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, ప్రజలకు చేరువ చేసే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్లు జనసేన కోఆర్డినేటర్ డాక్టర్ చుంచు రాజ్ కిరణ్ తెలిపారు. దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ ప్రాంతాలకు చెందిన జనసైనికులతో శనివారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల భాగస్వామ్యం, స్థానిక సమస్యలపై చర్చించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలంతా...