వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం న్యూలక్ష్మీపురంలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం న్యూలక్ష్మీపురం: దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా న్యూలక్ష్మీపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.   ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన...