POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 2:50 pm Posted by : POLITICAL POWER

పేద ప్రజల సంక్షేమ ప్రదాత వైయస్సార్

పేద ప్రజల సంక్షేమ ప్రదాత వైయస్సార్ అని పందిళ్ళపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు దేవరపల్లి రవికుమార్ రెడ్డి , ఇనుకుళ్ల అనంతరెడ్డి, లు కొనియాడారు. బుదవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండల పరిధిలోని పందిళ్ళపల్లి గ్రామంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సెంటర్లోని వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవరపల్లి, రవి కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేసి ఆరోగ్య ప్రదాతగా రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నతమైన వ్యక్తి వైఎస్సార్ అని కీర్తించారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలందరికీ ఆరోగ్య భరోసా కల్పించి ప్రతి పేదవాడి గుండెల్లో వైయస్సార్ నిలిచిపోయారని ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు. రాష్ట్ర రాజకీయాలలో జరగని ముద్ర వేసిన వైయస్సార్ నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నారంటే ఆయన అందించిన సుపరిపాలనే మరణమని, రాజకీయాలలో నిస్వార్థ రాజకీయ మహా నాయకుడు అని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఆనం ప్రభాకర్ రెడ్డి, చింతకాని మండల కో ఆర్డినేటర్ నాయకులు ఇనుకుళ్ళ నాగసురారెడ్డి, చల్లా వెంకటేశ్వర రెడ్డి, ఎనుముల తిరుపతిరెడ్డి, మండే రాములు, వాకా వీరారెడ్డి, ఇనుకుళ్ళ సీతారాం రెడ్డి, దేవరపల్లి సుధాకర్ రెడ్డి, మండే శ్రీనివాసరావు, వాకా కనకా రెడ్డి, చల్లా వెంకటేశ్వర రెడ్డి, ఆనం నరేష్, ఆనం లచ్చిరెడ్డి, ఎనుముల సైదారెడ్డి, చల్లా బద్రారెడ్డి, అలవాల జనార్ధన్, మాజీ ఎంపిటిసి ఓర్సు వీరభద్రం, నెంబర్ వెంకటేశ్వర్లు, రెడ్డి మల్ల వెంకటేశ్వర రెడ్డి, చిట్ల వెంకటరెడ్డి తాళ్లూరి నాగరాజు, తాళ్లూరి రామారావు, ఈర్ల వీరబాబు, వెంకట నర్సు, అలవాల వెంకట నరసయ్య, లింగం రాంబాబు, వైయస్సార్ అభిమానులు పాల్గొన్నారు.