POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 3:04 pm Posted by : POLITICAL POWER

*మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక పొలిటికల్ న్యూస్ (PN)9 టివి ఆంధ్రప్రదేశ్  తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి

దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 17వ వర్ధంతి సందర్భంగా నర్సంపేటలోని వైయస్సార్ స్మారక గార్డెన్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, పండ్లను పంపిణీ చేయడం జరిగింది.

ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో “ప్రజలే నా కుటుంబం” అనే భావనతో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక కార్యక్రమాలను అమలు చేసిన మహానేత వైయస్సార్.

🌾 రైతులకు ఉచిత విద్యుత్

🏥 ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం

🏠 ఇందిరమ్మ ఇళ్ల ద్వారా నిరుపేదలకు సొంతింటి కల

🎓 ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్య

👩‍👩‍👧 మహిళల స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం

💧 జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట

🚌 పేదల సంక్షేమం, సామాజిక భద్రతకు అనేక పథకాలు

వైయస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయి. అందుకే ఆయనను ప్రజలు నేటికీ “మహానేత”గా ఆప్యాయంగా గుర్తుచేసుకుంటున్నారు.

వైయస్సార్ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా… పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు.

కార్యక్రమంలో పాల్గొన్నవారు గిరగాని చంద్రమౌళి, జిల్లేపల్లి దినేష్, మాదాసి శోభ, ఖాజాబీ, నాడెం నాగేశ్వర్, శ్రీనివాస్, రాజు, రాజేందర్, రామకృష్ణ, కట్టయ్య, శివ, ధనరాజ్ పాల్గొన్నారు

*నాడెం శాంతి కుమార్

* మాజీ డైరెక్టర్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ

బీఆర్ఎస్ నాయకులు

నర్సంపేట నియోజకవర్గం, వరంగల్ జిల్లా