POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 5:39 pm Posted by : POLITICAL POWER

త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఖమ్మం…

*కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక  ఖమ్మం బ్యూరో

ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కిడ్నాప్ కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ మూడోవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, ఖమ్మం నందు గౌరవ జడ్జి శ్రీ అరవ ప్రవీణ్ గారు ఒక్కొక్కరికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, అదేవిదంగా ఒక్కొక్కరికి రూ.5,000/- జరిమానా, మొత్తం రూ.15,000/- జరిమానా విధించారని ఇన్స్పెక్టర్ మోహన్ బాబు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కొక్కరు అదనంగా 3 నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వివరించారు.

కేసు వివరాల ప్రకారం :

ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr.No.83/2018 U/s 365 IPC, CC.No.285/2018గా నమోదైన కేసులో చక్కిలెల @ నాగమళ్ల సతీష్ (A1), చక్కిలెల సంతోష్ (A2), చక్కిలెల సుమన్ (A3) నిందితులుగా ఉన్నారు.

2018 ఏప్రిల్ 20 న రాత్రి సమయంలో ఖమ్మం కిన్నెరసాని థియేటర్ ఎదురుగా ఉన్న కిరాణా జాగిరి మర్చంట్స్ ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన వివాహ కార్యక్రమంలో కొత్త విశ్వనాధంతో గొడవపడి, అతనిని బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్ చేసి, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించినట్లు కేసు నమోదైందని తెలిపారు. ఈ మేరకు భార్య కొత్త గీత 2018 ఏప్రిల్ 21 న ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేశారని పేర్కొన్నారు.

ఈ కేసులో అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్ U. వెంకన్న బాబు, (ప్రస్తుతం DSP, ఇల్లందు) పనిచేశారు. బ్రీఫింగ్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ J. మోహన్ బాబు, APP శ్రీమతి S. గాయత్రి సమర్థవంతమైన ప్రాసిక్యూషన్ నిర్వహించగా, CDO V. రామకృష్ణ, కోర్టు లైజన్ అధికారులు K. శ్రీకాంత్, SI, K. శ్రీనివాస్, HC, D. నాగేశ్వరరావు, HC సహకరించారు. ప్రసూక్యూషన్ కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.