POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 10:37 pm Posted by : POLITICAL POWER

లక్షెట్టిపేటలో టాటా ఏఐజి, టాటా ఏఐఏ నూతన సబ్ బ్రాంచ్ కార్యాలయం ప్రారంభం

సెప్టెంబర్ 2 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెటిపేట లో ,  టాటా గ్రూప్స్ కు చెందిన టాటా ఏఐజి, టాటా ఏఐఏ అనుబంధ సంస్థల సబ్ బ్రాంచ్ సూపర్ అసోసిమేంట్ కార్యాలయం లక్షెటిపేట పట్టణంలో మంగళవారం ఘనంగా ప్రారంభించమయింది.ఈ కార్యక్రమంలో టాటా ఏఐజి హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ నగేష్ ప్రారంభించారు. మోటార్ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజలు, రాజకీయ ప్రముఖులు, టాటా ఏఐజి కస్టమర్లు, ఏజెంట్లు, సిబ్బంది, పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన టాటా ఏఐజి సీనియర్ మేనేజర్ బోడ కుంటి నగేష్ మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన సేవలందించడం టాటా తోటే సాధ్యమని కార్యాలయం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని అన్నారు.హెల్త్, మోటార్ లైఫ్ ఇన్సూరెన్స్ ,సేవలకు పరిమిత చేరువ చేయడమే మా ప్రధాన లక్ష్యం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ స్థాపకుడు పెట్టేం నరేష్, సూపర్ అసోసియేమెంట్ పెట్టేం వనిత, ఫస్ట్ వాడ కౌన్సిలర్ బుద్దే సిద్ధార్థ్ వర్మ, ఏడవ వార్డు కౌన్సిలర్ బోడ రాజేందర్, టాటా ఏఐజి కి సంబంధించిన ఏజెంట్లు, టాటా కి సంబంధించిన కస్టమర్లు, ప్రముఖ రాజకీయ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.