పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు – స్వర్గీయ నంబూరి కాంతారావు గారు వర్ధంతి సందర్భంగా ఘన నివాళి కొన్ని జీవితాలు తమ కోసం మాత్రమే కాదు… సమాజం కోసం జీవిస్తాయి. కొంతమంది మనుషులు తమ కుటుంబాన్ని మాత్రమే కాదు… తమ చుట్టూ ఉన్న ఎన్నో కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. అలాంటి మహోన్నత వ్యక్తిత్వం మా తండ్రిగారైన స్వర్గీయ నంబూరి కాంతారావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని తెలంగాణ ప్రాంతంలో పేదరికం తీవ్రంగా ఉన్న రోజుల్లో, అనేక బడుగు, బలహీన వర్గాల కుటుంబాలకు తమ...