POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 03 September 2026, 6:28 pm Posted by : POLITICAL POWER

మండల స్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి గౌరవ ఎమ్మెల్యే. డా.దాసరి సుధ .

కలసపాడు సెప్టెంబర్ 3 పొలిటికల్ పవర్ 9 టీవీ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక రిపోర్టర్ ఎం .ప్రసాదరావు. కలసపాడు. కడప జిల్లా.కలస పాడు లో జరిగిన మండల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన గౌరవ ఎమ్మెల్యే

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ,ముఖ్యంగా గ్రామాల్లో పారిశుధ్యం క్రమం తప్పకుండా నిర్వహించాలి.

వైద్య సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటు లో ఉంటూ వైద్య పరీక్షలు కోసం వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.కరెంట్ సిబ్బంది ఎక్కడా కూడా కరెంట్ కొరత లేకుండా వ్యవసాయానికి మరియు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి అని సూచించారు.రైతులకు వ్యవసాయ అధికారులు నిరంతరం అందు బాటులో ఉంటూ ఎరువులు సరఫరాలో ఎటువంటి కొరతా లేకుండా ప్రతి రైతుకు ఎరువు అందేలా చూడాలని ఆమె అన్నారు.పశు వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి గొర్రెలకు,మేకలు కు టీకాలు వేస్తూ సకాలంలో మూగజీవాలను కాపాడాలని అన్నారు.భూ సమస్యలు ఎక్కువ ఉండటం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ,రెవెన్యూ సిబ్బంది భూ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు.మండలం లో ఎటువంటి శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసువారికి తెలియజేశారు. అలాగే ఉపాధి, రహదారుల నిర్మాణం, హౌసింగ్ ఇంకా వివిధ రకాలు సమస్యల పై మాట్లాడటం జరిగింది అన్నారు.అనంతరం త్వరలో పదవి విరమణ పొందుతున్న యం.పి.టి.సి లను, జడ్.పి.టి.సి మరియు యం.పి.పి లను ఘనంగా సన్మానించారు.గౌరవ ఎమ్మెల్యే ని కూడా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు, మరియు ఎంపీపీ, బోధనపల్లి నారాయణ, జడ్పిటిసి అంకన్న గురువిరెడ్డి, పెద్దిరెడ్డి.పురుషోత్తం రెడ్డి , సుధా. రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సిపి ఆక్టివేట్ నెంబర్, చిత్త. రాజశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుదర్శన్, మాజీ సర్పంచ్. పెద్దిరెడ్డి.నారాయణరెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు బాలన్కిరెడ్డి, ఐ.టి. వింగ్ మధు, ఎంపీటీసీలు నారాయణరెడ్డి, రమేష్, మాజీ సర్పంచ్లు పార్టీ నాయకులు అన్ని శాఖల అధికారులు నాయకులు పాల్గొన్నారు..