POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 05 September 2026, 6:45 pm Posted by : POLITICAL POWER

గిరిజన సంస్కృతికి ప్రత్యేక తేజ్ పండుగ

పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట పట్టణంలో ఘనంగా తీజ్  పండుగను తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇందల్ రాథోడ్ జాతీయ విద్యార్థి ఉపాధ్యక్షులు శ్రావణ మాసంలో వచ్చే రాఖీపూర్ణిమ రోజు ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగుస్తుంది. పెళ్ళికాని అమ్మాయిలు అందరు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వెదురు బుట్టల్లోనే కాకుండా “మోదుగు” ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి, గోదుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడ పిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు. ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు “పులియాగెణో” పూర్ణకుంభం తలపై పెట్టుకొని బావి నీళ్లుకాని, బోరింగ్ నీళ్ళుకాని, చెరువు నీళ్లుకాని, తీసుకు వచ్చి తీజ్ కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్ కి నీళ్ళ పోయ్యనివ్వకుండా ఆపి కొన్ని పొడుపు కథలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పినవారికి తీజ్ కి నీళ్ళు పొయ్యనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నీళ్ళు జల్లుతూ అగరు బత్తులతో దూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు.