సెయింట్ ఆంటోనీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లోకృష్ణాష్టమి జన్మదిన వేడుకలు
కలసపాడు సెప్టెంబర్ 4..
కలసపాడు మండలంలోని స్థానిక సెయింట్ ఆంటోనీ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలను కరెస్పాండెంట్ చిత్తా, రాజశేఖర్ రెడ్డి మరియు ప్రిన్సిపల్ చిత్తా, ప్రభావతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీకృష్ణుని జన్మదిన వేడుకల( కృష్ణాష్టమి) సందర్భంగా విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణలో, వివిధ నృత్యాలు ప్రదర్శించి అందరిని ఆకట్టుకున్నారు. అనంతరం గోపికలందరూ శ్రీకృష్ణుని చుట్టూ చేరి ఆనంద సంబరాలతో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
