అమ్మకానికి తెలంగాణ ట్రాన్స్‌కో..!!
విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తొలి అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
ట్రాన్స్‌కోలో 26% వాటాను విక్రయించేందుకు వేగంగా ప్రణాళికలు
కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సంస్థ(ట్రాన్స్‌కో)లో ప్రభుత్వానికి ఉన్న 100% వాటాలో 26% విక్రయించాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనికోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్(డీఆర్‌హెచ్‌పీ)ను సిద్ధం చేసి, తన ఆర్థిక పరిస్థితిని, డబ్బు ఎందుకు అవసరం అనే అంశాలను సెబీకి తెలియజేయనున్న ట్రాన్స్‌కో డీఆర్‌హెచ్‌పీకు సెబీ ఆమోదం తెలిపిన అనంతరం, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీవో)కు వెళ్లి, స్టాక్ మార్కెట్ ద్వారా తమ షేర్లను ప్రజలకు విక్రయించనున్న ట్రాన్స్‌కో సంస్థ మలి విడతలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, అనంతరం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్ అవనున్న కంపెనీ ఈ ప్రక్రియ కోసం ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్ అనే సంస్థను కన్సల్టెన్సీగా నియమించాలని నిర్ణయించిన తెలంగాణ పవర్ కో–ఆర్డినేషన్ కమిటీ ట్రాన్స్‌కోలో ఇతర సంస్థలకు భాగస్వామ్యం ఇవ్వాలని కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే వాటా విక్రయిస్తున్నారా అనే అంశంపై నిపుణుల చర్చలు ఇక ఐపీవోకు వెళ్లనున్న సంస్థల జాబితాలో మొదటి వరుసలో నిలవనున్న ట్రాన్స్‌కో అయితే ఈ అంశం బయటికి రాకుండా ట్రాన్స్‌కో ఉద్యోగులు అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడకూడదని, మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసిన ట్రాన్స్‌కో డైరెక్టర్ ఓరుగంటి శ్రీనివాసులు
