ఈ నెల 28 -09-2026 వ తారీకు నాడు ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ బెడ్ సైడ్ కాంటాక్ట్ కార్మికుల ధర్నా నోటీసు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజా శేఖర్ ఈరోజు హైదరాబాద్ డి ఎం ఈ కార్యాలయంలో అడిషనల్ డీఎంఈ కి ధర్నా నోటీస్ ఇవ్వటం జరిగింది అని ఎస్ పి ఎస్ మెడికల్ & హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య తెలియజేసినారు.
ప్రభుత్వ ఆస్పటల్ నందు పనిచేస్తున్న బెడ్ సైడ్ కాంటాక్ట్ కార్మికుల విధానం రద్దు చేసి నేరుగా కార్మికులని ఐ ఎఫ్ ఎం ఐ ఎస్ లో విలీనం చేసి కనీస వేతనం 26000/- ఇవ్వాలి అని మే నెల 25 వ తారీకు డి ఎం ఈ కార్యాలయం ముట్టడి చేయడం జరిగింది ఆనాడు డి ఎం ఈ గా ఉన్నటువంటి డాక్టర్ . నరేందర్ రాష్ట్రం మొత్తంలో మా యొక్క కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీకు తగిన న్యాయం చేస్తామని వెల్లడించడం జరిగింది. తర్వాత మేము మా ఎస్ పి ఎస్ అసోసియేషన్ తరపున పలుమార్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు దామోదర్ రాజనర్సింహం ని మరియు ప్రిన్సిపాల్ సెక్రటేరియ నందు మెడికల్ విభాగం క్రిస్టియ మేడం కి పలు సందర్భాల్లో కలిసి వినతి పత్రములు ఇవ్వడం జరిగింది. కానీ ఏ ఒక్క అధికారి కానీ రాజకీయ నాయకులు గానీ మా బెడ్ సైడ్ కార్మికుల గా పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ ల జీతాలు మరియు ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా ఏ ఒక్కటి కూడా కార్మికులకు అమలు అయ్యే రీతిగా యాక్షన్ తీసుకోలేదు. ఆనాడు డి ఎం ఈ ఆఫీసు ముందు మహాధర్నా సందర్భంగా మీరు కార్మికులు అడిగే దానిలో సరియైన న్యాయం ఉన్నది ప్రభుత్వ ఆస్పటల్ నందు మీ నాలుగు విభాగాలు నాలుగు స్తంభం లాంటిది తప్పనిసరి మీ యొక్క సమస్యను పరిష్కారం దిశగా తీసుకెళ్తామని హామీ ఇచ్చినటువంటి ఆరోగ్య శాఖ మంత్రి మరియు ఉన్నత అధికారులు మా సమస్యను పెడచెవిన పెట్టినారు. 2022 జీవో నెంబర్ 60 ప్రకారం ఆనాడు టెండర్ వేసి మధ్యలో దళారి వ్యవస్థగా కార్మికులను వెట్టి చాకిరి చేపించినారు అని ఆవేదన వ్యక్తపరిచారు ఇది ఏమిటి అని అడిగిన కార్మికులను వ్యక్తిగత టార్గెట్ చేస్తూ తాండూరు , మిర్యాలగూడ , నల్గొండ , మహబూబా నగర్ , ఎటునాగారం ఇంకా మిగిలిన కొన్ని ప్రాంతంలో కార్మికులను ఉద్యోగాల నుండి తొలగించే ప్రయత్నాలు అక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు రాజకీయ నాయకులు గురిచేస్తున్నారు అని మండిపడినారు ఇకనైనా మా బెడ్ సైడ్ కాంటాక్ట్ కార్మికుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు ఉన్నత అధికారులు చొరవ తీసుకొని ఈనెల 28వ తారీకు లోపల మాకు రావలసిన జరగవలసిన న్యాయం చెయ్యని పక్షాన ఎస్ పి ఎస్ మెడికల్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కార్మికుల 18000 మంది పక్షాన అండగా నిలబడి మహా ధర్నా నిర్వహిస్తామని తెలియపరుస్తూ ఈరోజు అడిషనల్ డీ ఎం ఈ కి ధర్నా నోటీసు ఇవ్వడం జరిగింది. 28వ తారీకు లోపల మా సమస్యలు పరిష్కారం కానీ ఎడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ లు అందరూ కలిసి హైదరాబాద్ నగరం నడిబొడ్డున పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తాము అని తెలియపరిచినారు ఆనాడు ప్రభుత్వం ఇచ్చిన జీవ ప్రకారం కార్మికులకు మెదక్ జీవితం కరెక్ట్ గా ఇవ్వకుండా ఈపీఎఫ్ & ఈఎస్ఐ లలో కూడా అవకతోకలు చేసి కార్మికులను ఏడిపించుకుని పైశాచిక ఆనందం పొందుతున్న కాంట్రాక్టర్లను కూడా వారికి తగిన మూల్యం చెల్లించక తప్పదు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చిన్న బోస్క నరేష్ జనగామ జిల్లా ఎస్ పి ఎస్ కమిటీ అధ్యక్షులు ఏనుగుల రఘు తదితర కార్మిక నాయకులు పాల్గొన్నారు.
