హెచ్ ఐవి – టీబీ వ్యాదుల పై అవగాహన క్యాంపేయిన్
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ గారి ఆదేశాల మేరకు హెచ్ ఐవి ఎయిడ్స్ మరియు టీబీ వ్యాదులపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి ఇంటెన్సిఫైడ్ ఐఈసి క్యాంపేయిన్ లను నిర్వహిస్తున్నామని లక్షెట్టిపేట ఐసీటీసీ కేంద్రం కౌన్సిలర్ ఆంజనేయులు అన్నారు. మంగళవారం నాడు లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల లో విద్యార్థులకు సెల్ఫ్ రిస్క్ అసెస్మెంట్ క్యూఆర్ కోడ్ పోస్టర్ లను విడుదల చేసి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్ రావు ,టీబీ సూపర్ వైజర్ సురేష్ , మరియు లెక్చరర్స్ పాల్గొన్నారు.

