POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 6:46 pm Posted by : POLITICAL POWER

గత ప్రభుత్వ అప్పులకు డబ్బులున్నాయి..విద్యార్థుల ఫీజు బకాయిలకు మాత్రం నిధులు లేవా?

సెప్టెంబర్ 8:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

ఈ రోజు మందమర్రి మండల కేంద్రంలో…పెండింగ్ ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలి కోరుతూ ఐక్య విద్యార్థి సంఘాల (TVUV,బీసీ విద్యార్థి సంఘం,NSC) ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీ చెల్లింపులు,ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించడానికి నిధులు సమకూరుస్తున్నప్పుడు,విద్యార్థుల విద్యకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ బకాయిలను చెల్లించడంలో ఎందుకు జాప్యం చేస్తుందో ప్రభుత్వం విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల్లోని పేద,మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి కళాశాలలకు రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా సర్టిఫికెట్లు, పరీక్షలు, తదుపరి విద్యా అవకాశాలు వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అయినా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం దారుణమని అన్నారు.ప్రభుత్వాలు మారినా విద్యార్థుల సమస్యలు మాత్రం పరిష్కారం కాకపోవడం బాధాకరం. అప్పులు తీర్చడం ఎంత ముఖ్యమో, రాష్ట్ర భవిష్యత్తైన విద్యార్థుల విద్యను కాపాడటం అంతకంటే ముఖ్యమైన బాధ్యత అని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు.ఫీజు బకాయిలను సాధారణ ఆర్థిక భారంగా చూడకుండా, అత్యవసర అంశంగా పరిగణించి వెంటనే నిధులు విడుదల చేయాలని,పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ లను పూర్తిగా చెల్లించడం తో పాటు, భవిష్యత్తులో బకాయిలు పేరుకు పోకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పూరెళ్ళ నితీష్,బచ్చలి అభిరామ్,అసంపెల్లి కుమార్,మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.*