POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 8:34 pm Posted by : POLITICAL POWER

 

*రాజీనామా ప్రకటన*

నేను *సీరపు సుగుణ రెడ్డి*. (పాల్వంచ 1వ డివిజన్ కార్పొరేటర్), ఇటీవల నన్ను కొత్తగూడెం జిల్లా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలిగా నియమించారు. రెడ్డి జాతి అభ్యున్నతికి, మహిళల సంక్షేమానికి మరియు సమాజానికి నా వంతుగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ బాధ్యతను స్వీకరించాను.

రెడ్డి జాగృతి నుండి ముప్పాని సోమిరెడ్డి గారు, శ్యామ్ సుందర్ రెడ్డి గారు నన్ను సంప్రదించి ఈ బాధ్యతను స్వీకరించాలని కోరినప్పుడు, జాతి ప్రయోజనాల కోసం పనిచేయాలనే ఉద్దేశంతో నేను అంగీకరించాను.

అయితే, ఇటీవల రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు బుట్టెంగారి మాధవ రెడ్డి గారిపై హైదరాబాద్‌కు చెందిన కళ్యాణి రెడ్డి, రఘుపతి రెడ్డి దంపతులు చేసిన మోసానికి సంబంధించిన ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి.

నాకు పదుల సంఖ్యలో కొత్తగూడెం, పాల్వంచ నుండి రెడ్డి సోదరులు ఫోన్ చేసి ఈ మోసంలో మీ వాటా ఎంత అని? ? అలాంటి వ్యవస్థాపక అధ్యక్షుడి సంఘం లో ఎలా ఉంటున్నావ్, ఆ ముఠా లో నువ్వు కూడా సభ్యురాలేనా? అని నన్ను ప్రశ్నిస్తుంటే సమాజం లో గౌరవప్రదమైన హోదాలో ఉన్న నాకు, ఇలాంటి సంఘంలో ఉండటం మంచిది కాదు అని నిర్ణయించుకున్నాను.

ఈ విషయం కేవలం ఒక ఆరోపణగా భావించి నేను నిర్ణయం తీసుకోలేదు. సంబంధిత వ్యక్తుల వివరణను తెలుసుకోవడంతో పాటు, ఆరోపణలు చేసిన బాధితులతో కూడా నేను స్వయంగా మాట్లాడి వారి వాదనను తెలుసుకున్నాను. అందుబాటులో ఉన్న వివరాలను పరిశీలించిన అనంతరం, ఈ వ్యవహారంలో నేను అంగీకరించలేని అంశాలు ఉన్నాయని, మోసం చేసారు అని నిర్దారించుకున్నాను ఇలాంటి పరిస్థితిలో అదే సంఘంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగడం నా మనస్సాక్షికి సమ్మతం కాదని నిర్ణయించుకున్నాను.

ముఖ్యంగా, ఒక సంస్థకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పుడు, వాటిపై పారదర్శకంగా, హుందాగా, బాధ్యతాయుతంగా సమాధానం ఇవ్వడం మరియు సంస్థ గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహరించడం ఎంతో అవసరం కానీ సంఘానికి వ్యవస్థాపక అధ్యక్షుడు గా ఉంటున్న మాధవ రెడ్డి కి అలాంటి లక్షణాలు ఒక్కటి కూడా లేవు, రెడ్డి జాతికి చెడ్డ పేరు తెచ్చే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి అని నిర్దారించుకున్నాను.

అందువల్ల, ఈ రోజు నుండి కొత్తగూడెం జిల్లా రెడ్డి జాగృతి మహిళా అధ్యక్షురాలిగా నా పదవికి, అలాగే రెడ్డి జాగృతితో నా అధికారిక అనుబంధానికి నేను స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నాను.

ఈ రాజీనామా నిర్ణయం ఎవరి మీద వ్యక్తిగత కక్షతోనో, రాజకీయ ప్రయోజనంతోనో, వ్యక్తిగత విభేదాలతోనో తీసుకున్నది కాదు. నా విలువలు, నా మనస్సాక్షి మరియు రెడ్డి జాతి పట్ల నాకు ఉన్న బాధ్యతకు అనుగుణంగా తీసుకున్న స్పష్టమైన నిర్ణయం.

ఒక సామాజిక సంస్థలో పదవి అనేది కేవలం గౌరవం కోసం కాదు; అది బాధ్యత, నమ్మకం మరియు నైతిక విలువలకు ప్రతీక. ఆ నమ్మకానికి భంగం కలిగే పరిస్థితిలో పదవిలో కొనసాగడం నాకు సరైనదిగా అనిపించలేదు. అందుకే పదవిని వదులుకోవడమే నేను సరైన మార్గంగా భావించాను.

నేను రెడ్డి జాతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు. రెడ్డి జాతి ఐక్యత, గౌరవం, ఆత్మగౌరవం, పరస్పర నమ్మకం మరియు సమాజ అభ్యున్నతి కోసం నా వంతు కృషి ఎప్పటికీ కొనసాగుతుంది. అయితే, ఏ సంస్థలో ఉన్నా మన చర్యలు సమాజానికి ఆదర్శంగా ఉండాలి; మన వల్ల సమాజానికి చెడు పేరు రావడం మాత్రం జరగకూడదు.

మన వల్ల రెడ్డి జాతికి మేలు జరగకపోయినా పర్వాలేదు…

కానీ మన వల్ల రెడ్డి జాతికి కీడు మాత్రం జరగకూడదు.

ఈ మాటలనే నా నిర్ణయానికి ప్రాతిపదికగా భావిస్తూ, రెడ్డి జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలి పదవికి నేను రాజీనామా చేస్తున్నాను.

ఇట్లు

సీరపు సుగుణ రెడ్డి