బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి మధ్యాహ్నం సినిమా చూడటానికి 3 టికెట్లు కొనుగోలు చేశాడు. సమయానికి థియేటర్‌కు చేరుకుని తన సీట్లో కూర్చున్నాడు.
అయితే సినిమా ప్రారంభమయ్యే ముందు థియేటర్‌లో 25 నిమిషాల పాటు ప్రకటనలు ప్రదర్శించారు.
దీంతో సినిమా ఆలస్యంగా ముగిసింది. ఆ తర్వాత అతనికి కొన్ని పని సంబంధిత ఫోన్ కాల్స్ ముందుగానే షెడ్యూల్ అయి ఉన్నాయి. సినిమా ఆలస్యం కావడంతో వాటిని రద్దు చేయాల్సి వచ్చింది.
దాంతో దేశంలోనే అతిపెద్ద సినిమా చైన్‌లలో ఒకటైన PVR INOXపై అతను కోర్టును ఆశ్రయించాడు.
ఆయన పేరుఏం.ఆర్. అభిషేక్.బెంగుళూరులో అడ్వకేట్ , వయసు 31
తేదీ: 26 డిసెంబర్ 2023.
సినిమా: సామ్ బహదూర్.
థియేటర్: PVR INOX.
ఆయన టికెట్‌పై షో ప్రారంభమయ్యే సమయం స్పష్టంగా ఉంది. కానీ ఆ సమయానికి సినిమా ప్రారంభం కాలేదు.మొదట ప్రదర్శించినవి 25 నిమిషాల వాణిజ్య ప్రకటనలు. ఇతర సినిమాల ట్రైలర్లు కాదు — ప్రకటనలు.
మనలో చాలామంది ఈ పరిస్థితిని ఎదుర్కొనే ఉంటాం. సమయానికి థియేటర్‌కు చేరుకుంటాం. సీట్లో కూర్చుంటాం. లైట్లు ఆరిపోతాయి. సినిమా ప్రారంభం కావాల్సిన సమయంలో ప్రకటనలు మొదలవుతాయి. సినిమా కోసం ఎదురుచూస్తూ వాటిని చూడాల్సి వస్తుంది.ఇది ఎంత సాధారణంగా మారిపోయిందంటే, దీనిని సమస్యగా కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోరు.
కానీ అభిషేక్ మాత్రం దీనిని సమస్యగానే చూశాడు.
అతను బెంగళూరులోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో కేసు దాఖలు చేశాడు.అతని వాదన చాలా స్పష్టంగా ఉంది.
తాను ఒక సేవ కోసం డబ్బు చెల్లించాడు. ఆ సేవ ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభమవుతుందని టికెట్ ద్వారా తెలియజేశారు. కానీ నిర్ణయించిన సమయానికి సినిమా ప్రారంభం కాలేదు.
తన సమయాన్ని తన అంగీకారం లేకుండా తీసుకున్నారు. దాని కారణంగా తన పని సంబంధిత ఫోన్ కాల్స్‌ను కూడా రద్దు చేసుకోవాల్సి వచ్చింది.సినిమా సంస్థ తన వాదనను వినిపించింది.
సినిమా ప్రారంభానికి ముందు దాదాపు 10 నిమిషాల పాటు ప్రజా ప్రయోజన ప్రకటనలు (Public Service Announcements) ప్రదర్శించాల్సిన అవసరం చట్టంలో ఉందని, అందువల్ల కొంత ఆలస్యం తప్పదని సంస్థ తెలిపింది.
కమిషన్ కూడా 10 నిమిషాల వరకు ప్రజా ప్రయోజన ప్రకటనలు ప్రదర్శించాల్సి ఉండవచ్చని అంగీకరించింది.కానీ 10 నిమిషాల నిబంధన 25 నిమిషాల ప్రకటనలను సమర్థించదని స్పష్టం చేసింది.
తీర్పు సంస్థకు వ్యతిరేకంగా వచ్చింది.
అభిషేక్‌కు నష్టపరిహారంగా ₹20,000, కేసు కోసం చేసిన ఖర్చులకు ₹8,000 చెల్లించాలని PVR INOXను ఆదేశించింది.అంతేకాకుండా వినియోగదారుల పరిరక్షణ కార్యక్రమాల కోసం ఉపయోగించే ప్రభుత్వ నిధి అయిన Consumer Welfare Fundకు ₹1 లక్ష చెల్లించాలని కూడా ఆదేశించింది.
అయితే తీర్పులోని కొన్ని వ్యాఖ్యలే అసలు గుర్తుంచుకోవాల్సిన విషయం.
“ఈ నవీన యుగంలో సమయమే డబ్బు” అని కమిషన్ పేర్కొంది. ప్రతి వ్యక్తి సమయం ఎంతో విలువైనదని తెలిపింది.అవసరం లేని ప్రకటనలను చూస్తూ థియేటర్‌లో 25 నుంచి 30 నిమిషాలు ఖాళీగా కూర్చోవాల్సి రావడం చాలా ఎక్కువ సమయమని కమిషన్ పేర్కొంది.ప్రజలకు పనికి, వృత్తికి సంబంధించిన షెడ్యూల్స్ ఉంటాయని,సినిమాకోసం వెచ్చించే విలువైన సమయమే ఎక్కువ అని వ్యాఖ్యానించింది.
PVR INOXకు భారతదేశం, శ్రీలంకలో కలిపి 900కు పైగా స్క్రీన్లు ఉన్నాయి.అయితేనేం
అభిషేక్ .. మూడు సినిమా టికెట్లు, ఒక బిల్లు ఆధారంగా ఆ వ్యాపారాన్ని ప్రశ్నించాడు..మనుషుల సమయానికి విలువ ఉందని తెలియజేసేందుకు మూడేళ్లు పోరాడాడు.హాట్సాఫ్ టు అభిషేక్ .