*కల్లూరు పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్* నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం కల్లూరు పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించి సమగ్రంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, నేరాల నియంత్రణ చర్యలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రజల నుంచి వచ్చే...