మహబూబ్ నగర్, నారాయణపేట్ ఇంచార్జ్ గా : *డాక్టర్ లోకేష్ యాదవ్*
టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి సూచనల మేరకు మీడియా కమిటీ చైర్మన్ ఎంపీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధికార ప్రతినిధులను జిల్లాల సమన్వయకర్తలుగా నియమించారు ఈ సందర్భంగా రెండు జిల్లాల ఇంచార్జ్ గా టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ ను నియమించారు
ఈ సందర్భంగా డాక్టర్ లోకేష్ మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ దళితుల పట్ల బిఆర్ఎస్, బిజెపి పార్టీ లు వ్యవహరించిన తీరును ప్రజల ముందు ఎండగట్టేందుకు తొలి విడత జిల్లాలలో ప్రెస్ మీట్ లు నిర్వహించనున్నట్లు తెలియజేశారు
ప్రత్యేకంగా అసెంబ్లీ లోపల బయట దళితులు పట్ల బీఆర్ఎస్ వ్యవహరించిన తీరు రాజ్యాంగబద్ధమైన గౌరవనీయ శాసనసభ స్పీకర్ ను వారు ఏ విధంగా అవమానించారు అలాగే దళిత నాయకుల పట్ల చూపిన వివక్షను ప్రజలకు వివరిస్తామన్నారు
ఇదే తరహాలో బిజెపి కూడా గౌరవనీయ ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు సందర్శించిన ప్రదేశంలో శుద్ధికరణ కార్యక్రమం నిర్వహించిన ఘటనను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అన్నారు
దళితుల ఆత్మ గౌరవం దెబ్బతీసే ఇలాంటి చర్యలు ఏ పార్టీ చేసిన తీవ్రంగా వ్యతిరేకిస్తూ…. సామాజిక న్యాయం, సమానత్వం, దళితుల ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలియజేస్తూ….
జిల్లాలలో ప్రెస్ మీట్ లు పెట్టి డిసిసి కార్యవర్గాన్ని సమాయత్వం చేస్తామని ఈ సందర్భంగా టిపిసిసి అధికార ప్రతినిధి డాక్టర్ లోకేష్ యాదవ్ తెలియజేశారు.