POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 1:50 pm Posted by : POLITICAL POWER

13వ వార్డు లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు.

13వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ

సెప్టెంబర్ 11:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షేట్టిపేట్ మున్సిపాలిటీ 13వ వార్డులోని చర్చి కాలని వున్న వాసులుకు జ్వరం రావడంతో మంచిర్యాల జిల్లా ఆరోగ్య వైద్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అదే విధంగా వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ సమత వారి ఆదేశాల మేరకు ఈరోజు లక్షెట్టిపేటలోని 13వ వార్డులో డెంగ్యూ జ్వరం తో అనుమానంతో వున్న వాళ్లని హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి రక్త నమునను సేకరిస్తూ టెస్టు చేస్తూ మందులు ఇవ్వడం జరిగింది డెంగు జ్వరం బారిన పడకుండా ఇళ్ళలో పైరీత్రియమ్ మందును స్ప్రే చేయడం జరిగింది అదేవిధంగా నీటి నిల్వ ఉన్నదాంట్లో బయట నీరు నిల్వ ఉన్న నీటి గుంటలలో టిమిఫాస్ అనే మందును పిచికారీ చేయడం జరిగింది. దీని వల్ల నీటి గుంటలలో వున్న దోమ లార్వాలను నశింపచేస్తుంది.మెడికల్ క్యాంపు నిర్వహించి అందరికీ రక్త పరీక్షలు మరియు మందులను అంజేయడం జరిగింది. సీజనల్ వ్యాధులు పై మరియు ఇంటిచుట్టూ పరిసర ప్రాంతాల లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే దోమలు పుట్టకుండా మరియు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలందరికి అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో 13వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ.మెడికల్ ఆఫీర్ డాక్టర్ సమత. హెచ్.ఈ. ఓ దేవేందర్. ఎం.ఎల్. హెచ్పి నవ్య. హెల్త్ అసిస్టెంట్ గపూర్. ఏ.ఎన్.ఎం సుజాత. ఆశ వర్కర్ జ్యోతి మున్ని పద్మ తదితరులు పాల్గొన్నారు.