POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 11:08 pm Posted by : POLITICAL POWER

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఎమ్మార్పీఎస్ దిమ్మెను కూల్చిన గుర్తు తెలియని వ్యక్తులు.

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ పి రమేష్ తెలంగాణ రాష్ట్రంలో పాలేరు నియోజకవర్గం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం పరిధిలోని ఎదులాపురం మున్సిపాలిటీ ఎనిమిదవ వార్డులో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి సంఘం దిమ్మెను గుర్తు తెలియని వ్యక్తులు కూల్చడం జరిగింది ఇది దళితులను అవమానించటమే అని ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి కార్యదర్శి కారేపల్లి మండలం ఇంచార్జ్ కనకం జనార్దన్ మాదిగ అన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా దత్తు దళితుల జీవితాల్లో మార్పు రాలేదని ఎన్నో ప్రభుత్వాలు మారిన వారికి ఎన్నో లక్షల కోట్ల బడ్జెట్లో కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెప్పుకోవడమే కానీ ఆచరణలో లేదు అని అన్నారు ఈ సంఘటనపై ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు మరియు ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు కూరపాటి సునీల్ మాదిగ సిరిపురం బందయ్య మాదిగ. గాజుల నరసింహారావు మాదిగ పగిడి కత్తుల ఈదయ్య మాదిగ. ఖమ్మం నగరానికి చెందిన ఎమ్మార్పీఎస్ నాయకులు బాగి శ్రీను మాదిగ . తదితరులు పాల్గొని ఫిర్యాదు చేయడం జరిగింది . ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు కొసమెరుపు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదేపదే మేము దళితుల పక్షపాతులము దళితుల కోసమే పని చేస్తున్నాము అని చెప్పు కుంటున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మాటల్లో చెప్పటమే కానీ చేతల్లో ఆచరించిన దాఖలాలు కనిపించడం లేదు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి ఎస్సీ ఎస్టీ కేసులు బలంగా పెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మాదిగ సంఘాలు మాదిగ కుల నాయకులు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న మాదిగలు కోరుకుంటున్నారు.