POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 11:49 pm Posted by : POLITICAL POWER

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.

పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారానికి సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న బెజ్జూర్ ఎస్సై సర్దార్ పాషాపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. బాధ్యతల నుంచి తప్పించి జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈ నెల 11న ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. వసూళ్లకు పాల్పడ్డారంటూ వచ్చిన ఫిర్యాదులపై జరిగిన విచారణలో ఆరోపణలు నిజమని తేలినట్లు సమాచారం. దీంతో ఎస్సైను బెజ్జూర్ పోలీస్ స్టేషన్ విధుల నుంచి తప్పించి జిల్లా కేంద్రానికి బదిలీ చేయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మరింత లోతైన విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంలో అధికారులు పారదర్శకంగా విచారణ జరిపి పూర్తి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.