POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 September 2026, 3:43 am Posted by : POLITICAL POWER

కోట్ల ఆస్తులు ఉన్నా… పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత దయనీయమో చెప్పే హృదయ విదారక ఘటన ఇది.

ముంబైలో ఓ వృద్ధ తల్లి…

కోట్ల ఆస్తులకు యజమాని.

ఆమె కుమారుడు అమెరికాలో పెద్ద ఇంజినీర్…

డబ్బు, హోదా, అంతస్తు అన్నీ ఉన్నాయి.

కానీ… తల్లితో మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా లేకుండా పోయింది!

దాదాపు 18 నెలలుగా తల్లికి ఫోన్ చేయలేదట

చివరకు అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన కుమారుడు తన ఇంటి తలుపు తెరిచి చూడగా…

సోఫా వద్ద కూర్చున్న స్థితిలోనే తల్లి మృతదేహం కుళ్లిపోయి, సగానికి పైగా అస్తిపంజరం బయటకు కనిపించే స్థితిలో ఉంది.

దాదాపు 10 నెలల క్రితమే ఆమె మరణించి ఉండవచ్చని సమాచారం.

కోట్ల ఆస్తి…

పెద్ద ఉద్యోగం…

అమెరికా జీవితం…

అన్నీ ఉన్నా…

👉 తల్లి ఒక్కతే!

ఇది కేవలం ఒక విషాద ఘటన కాదు…

మన సమాజం ఎటువైపు వెళ్తుందో ప్రశ్నించే సంఘటన.

మన పిల్లలకు పెద్ద చదువులు నేర్పిస్తున్నాం…

పెద్ద ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం…

డబ్బు సంపాదించాలని చెబుతున్నాం…

కానీ…

❤️ తల్లిదండ్రులను ప్రేమించడం నేర్పిస్తున్నామా?

🙏 వారిని క్షమించడం నేర్పిస్తున్నామా?

🤝 వృద్ధాప్యంలో వారికి అండగా నిలవడం నేర్పిస్తున్నామా?

👵👴 నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలతో ఆప్యాయంగా ఉండటం నేర్పిస్తున్నామా?

ఒక్కసారి ఆలోచించండి…

మన కోసం ఎన్నో రాత్రులు నిద్రపోని తల్లిదండ్రులకు… మన జీవితంలో కనీసం కొన్ని నిమిషాలు కూడా కేటాయించలేకపోతే, మనం ఎంత సంపాదించినా దాని విలువ ఏమిటి?

💔 డబ్బు మనిషిని ధనవంతుడిని చేయవచ్చు…

కానీ ప్రేమ, సేవ, మానవత్వమే మనిషిని “మనిషి”గా నిలబెడతాయి.

👉 తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారిని పలకరించండి.

👉 ఒక్క ఫోన్ కాల్ చేయండి.

👉 “ఎలా ఉన్నావమ్మా?” అని అడగండి.

👉 పిల్లలకు కూడా ఈ విలువలు నేర్పండి.

ఈ సంఘటనను మన పిల్లలకు ఒక పాఠంగా చెప్పాలి.

ఎందుకంటే…

తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత చేసే అంతిమ సంస్కారాల కంటే…

వారు బతికున్నప్పుడు చేసే ఒక్క ప్రేమపూర్వక పలకరింపే గొప్పది.

మానవత్వం మాయమవ్వకూడదు…

మనిషిలో “మనిషి” బతికే ఉండాలి.

ఎండీ ఫయాజ్ నల్లగొండ