ePaper
Monday, September 14, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

రాజకీయాలలో అరుదైన నాయకులలో మన నాయకుడు ఒకరు

అలాంటి నాయకుడి జయంతి సందర్బంగా అయన గూర్చి కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ఖమ్మం జిల్లాలో పాత ఇల్లందు తాలూకాలో పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ ల దంపతుల ఆరవరాజకీయాలలో అరుదైన నాయకులలో మన నాయకుడు ఒకరు

అలాంటి నాయకుడి జయంతి సందర్బంగా అయన గూర్చి కొంచెం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ఖమ్మం జిల్లాలో పాత ఇల్లందు తాలూకాలో పాతలింగాల గ్రామంలో రాంరెడ్డి నారాయణ రెడ్డి కమలమ్మ ల దంపతుల ఆరవ సంతానం మన నాయకుడు దివంగత నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారు ప్రాథమిక విద్యాబ్యాసం పాత లింగాల   మానుకోట మరియు డిగ్రీ వరంగల్ లో చేసి విద్యార్థి దశలోప్రత్యేక తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన నాయకుడు జైలు కు కూడా వెళ్లిన నాయకుడు

యువజన కాంగ్రెస్ లో చరుకుగా  పాల్గొనేవారు డిగ్రీ పూర్తి చేశాక ఢిల్లీ లో సివిల్స్ దాక వెళ్లి తిరిగి రాజకీయాలకు వచ్చిన నాయకుడు వారి పెద్దన్నయ్య దివంగత రాంరెడ్డి వెంకట్ రెడ్డి  తముడ్ని కలెక్టర్ ఎస్పీ గా చూడాలని కోరిక ఉండేదట కానీ మన నాయకుడు రాజకీయలు అంటే ఇస్టం తో ప్రజాసేవలో దిగిన నాయకుడు

వారి సోదరిమనిని ఎర్రపహడ్ ప్రాంతానికి చెందిన జెన్నారెడ్డి శ్యామసుందర్ రెడ్డితో వివాహం  మరల దామన్న వివాహం తుంగతుర్తి కోటమర్తి ప్రాంతానికి చెందిన ఉప్పునూతల సరోత్తం రెడ్డి కౌసల్య దేవి గార్ల కూతురు వరుదిని దేవీతో ఆలా దామన్న ప్రస్థానం నల్గొండ జిల్లాలో మొదలయింది

రాష్ట్ర యువజన కాంగ్రెస్ లో వి హన్మంత్ రావు  అధ్యక్షులు గా ఆ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడు గా నారా చంద్రబాబు నాయుడు గారు కోశాధికారి గా దామోదర్ రెడ్డి గారు ఉన్నారు వీళ్ళందరూ దామన్న కార్ ఫియట్ లో తిరిగేవారట ఆలా దామన్న చురుకుగా పార్టీ కార్యక్రమం లో తిరిగే వారు

అప్పటికే తుంగతుర్తి లో కాంగ్రెస్ నుండి జెన్నారెడ్డి శ్యామసుందర్ రెడ్డినియోజకవర్గం బాధ్యతలు చూసే వారు తుంగతుర్తి నుండి పోటీచేసినారు నాగారం సమితి అధ్యక్షులుగా పనిచేసారు

శ్యామసుందర్ రెడ్డి గారు బావమరిది అయిన దామోదర్ రెడ్డిని తుంగతుర్తి బరిలోకి దించాలని భావించి

1985 లో మొదటిసారి ఇందిరా కాంగ్రెస్ నుండి తుంగతుర్తి లో పోటీ చేసి విజయందుందిభి మోగించి చిన్న వయసులో శాసనసభ్యులు గా అయ్యారు

కాంగ్రెస్ వాళ్ళు గ్రామాలలో తిరగాలన్న భయపడే రోజులప్పుడు దామన్న ను కూడా కొన్ని గ్రామాలకు రావొద్దని అడ్డుపడేవారు కానీ దామన్న ఎక్కడ వెనుకడుగు వేయలేదు అదే ఆయనను బలమైన నాయడుని చేసింది అయన దైర్యం

కమ్యూనిస్ట్ ల అదీనంలో తుంగతుర్తి ఉండేది దామన్న వచ్చాక కాంగ్రెస్ ఆదీనంలోకి వచ్చింది ఆలా ప్రతి ఎన్నికలలో కాంగ్రెస్ జెండా రెప రెప లాడించిన నాయకుడు

1989 లో విజయం సాధించాక రాష్ట్ర మంత్రి వర్గంలో తొలి సారి మంత్రి అయ్యే అవకాశం వచ్చింది

1992 లో వై ఎస్ కోసం మంత్రి పదవి కీ రాజీనామా చేసారు వర్గ రాజకీయాలలో కూడా దామన్న నష్టపోయాడు

1994 లో కాంగ్రెస్ పార్టీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి  టికెట్ రాకుండా అడ్డుకున్నారు దామన్న కూడా పార్టీ నిర్ణయం ప్రకారం పోటీ చేయొద్దనుకున్నారు కానీ కార్యకర్తల అభిష్టం మేరకు

ప్రజా కాంగ్రెస్ నుండి నిచ్చెన గుర్తు మీద దామన్న పోటీ చేసి విజయం సాధించాడు అప్పుడు కాంగ్రెస్ కు రాష్ట్ర ములో 24 సీట్లు వచ్చాయి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు దామన్న ను తెలుగు దేశం పార్టీ కీ స్వయంగా ముఖ్యమంత్రి గారు ఆహ్వానించారు కానీ సున్నితంగా తిరస్కరించాడు

కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు

నల్గొండ జిల్లాలో ఎదురు లేని నాయకుడిగా చెలామణి అయ్యేవారు జిల్లాలో డి సి సి బి ఎన్నికల్లో కూడా దామన్నదే పై చేయి ఉండేది

నల్గొండ లో వర్గ రాజకీయాలలో పురుషోత్తం రెడ్డి వర్గం చకలం శ్రీనివాసరావు వర్గం ఉండేది తరువాత దామన్న వర్గం కూడా వచ్చింది ఒక

డి సి సి బి ఎన్నికల్లో చకలం కు భయం చూపిన నాయకుడు మన దామన్న చకలం ఎవరికీ బయపడేవాడు కాదు అప్పుడు బీరవోలు సోమి రెడ్డి చైర్మన్ అయ్యాడు

ఆలా నల్గొండ జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో ఐన కాంగ్రెస్ వారికీ ఇబ్బంది జరిగిన అక్కడకు వెళ్ళేవాడు దామన్న ఆలా దామన్నకు టైగర్ అని బిరుదు వచ్చింది

ఏదురోడ్డి పోరాడిన నాయకుడు దామన్న వస్తుండంటే ప్రజలు తండోపా తండాలుగా వచ్చేది దామన్న ప్రసంగం అయ్యేదాకా ఉండేవారు దామన్న ను అక్కున చేర్చుకునేవారు జనం సొంత ఇంటి మనిషి గా చూసేవారు

తిరిగి 1999 లో మొదటి సారి అపజయం సతీమణి అనారోగ్యం అమెరికా పయనం కొన్ని నెలలు అక్కడే ఉండటం కింది నాయకులు సరిగా ప్రచార బాధ్యత లు నెరవేర్చక స్వల్ప తేడాతో ఓటమి తరువాత సతీమణి మరణం దామన్న ను కుంగతీసింది

1999 లో వై ఎస్ ప్రతిపక్ష నాయకుడు అయ్యాక శ్రీరాంసాగర్ రెండవ దశ కోసం రక్త తర్పణం చేపించిన నాయకుడు లక్ష మందితో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి నిరూపించిన నాయకుడు

తిరిగి 2004 లో మళ్ళీ భరిలోకి దిగి విజయం సాధించి రాష్ట్ర మంత్రి వర్గంలో స్థానం సంపాదించాడు అప్పుడు కూడా దామన్నకు ఆలస్యంగా మంత్రి ఇచ్చారు 2006 లో అప్పుడు కూడా దామన్నకు నష్టం జరిగింది రాజకీయంగా

కానీ దామన్న మంత్రి ఇవ్వకున్నా పర్వాలేదు శ్రీరాంసాగర్ రెండవదశ పూర్తిచేయమని చెప్పి చేయించిన నాయకుడు మన దామన్న

తిరిగి 2009 లో పునరవిభజన వలన తుంగతుర్తి విడిచి సూర్యాపేట కు రావటం విజయం సాధించటం జరిగింది అప్పుడు సోదరుడికి మంత్రి ఇవ్వటం వలన దామన్నకు ఇవ్వలేదు మంత్రి వర్గంలో చోటు వై ఎస్ మరణం అది కూడా నష్టం

కానీ దామన్నకు కలసిరాని సంఘటన తెలంగాణ కోసం ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ వచ్చాక శాసన సభలో అడుగు పెట్టక పోవటం అది వెలితిగా ఉండేది

ఎన్నో వ్యయప్రయాసలకు నిలిచి ఎన్నో ఆస్తులు అమ్మి రాజకీయాలు చేసాడే కానీ జనం సొమ్ముతో రాజకీయాలు చేయలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడికి లేని ఆస్థి దామన్నకు ఉండేది నిస్వార్ధంగా రాజకీయాలు చేసాడు చివరికి మరణం కూడా తొందరగా వచ్చింది మహానుభావులు తొందరగా వెళ్తారని సామెత అలానే దేవుడు దామన్నను తీసుకుపోయాడు

దామన్న జయంతి సెప్టెంబర్ 14 సందర్బంగా

దామన్న యాదిలో

 

దామన్నకు వినమ్ర నివాళులు 🙏🙏🙏

మీ రవీందర్ రెడ్డి నంద్యాల

 

Latest Articles

కోట్ల ఆస్తులు ఉన్నా... పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్పొలిటికల్ పవర్...

Related Articles

కోట్ల ఆస్తులు ఉన్నా... పక్కన మనిషి లేకపోతే ఆ జీవితం ఎంత దయనీయమో చెప్పే హృదయ విదారక ఘటన ఇది.ముంబైలో ఓ వృద్ధ తల్లి...కోట్ల ఆస్తులకు యజమాని.ఆమె కుమారుడు అమెరికాలో పెద్ద ఇంజినీర్...డబ్బు,...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా...

వసుళ్ల ఆరోపణలపై ఎస్సై ని జిల్లా కేంద్ర కార్యాలయానికి అటాచ్.పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లికొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెజ్జూర్ మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా...
error: Content is protected !!