పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లి గ్రూప్–1, గ్రూప్–2 అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని వైయస్ జగన్‌కు వినతి గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర ఆధ్వర్యంలో అభ్యర్థులు శ్రీ వైయస్ జగన్‌ను కలిసి...