పొలిటికల్  పవర్   కథనం:   వాట్సాప్ గ్రూప్‌లలో 'కంటెంట్ కన్‌ఫ్యూజన్'.. ఎక్కడ ఏం పోస్ట్ చేయాలో తెలియక జనం తంటాలు! హైదరాబాద్ & మావిగన్ ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి చేతిలోనూ నడుస్తున్న డిజిటల్ మహాభారతం 'వాట్సాప్ గ్రూప్స్'. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు గుడ్ మార్నింగ్ బొమ్మలు, భక్తి శ్లోకాలు, రాజకీయ వాదనలు, పాత జోకులు, ఫార్వర్డ్ మెసేజ్‌లతో ఫోన్‌ల మోత మోగిపోతోంది. అయితే, ఏ గ్రూప్‌లో ఏది పెట్టాలనే ఇంగితజ్ఞానం కొరవడి, జనాలు అన్ని గ్రూప్‌లలోనూ ఒకే రకమైన...