POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:21 pm Posted by : POLITICAL POWER

మంచిర్యాలలో ఎంపీ వంశీకృష్ణ వర్గం బలప్రదర్శన

ఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ

మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం

సెప్టెంబర్ 18 :  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

మంచిర్యాల జిల్లాలో ఎంపీ గడ్డం వంశీకృష్ణకు మంతెన జగన్‌మోహన్‌రావు వర్గం ఘన స్వాగతం పలికింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మంతెన జగన్‌మోహన్‌రావు ఆధ్వర్యంలో ఇందారం ఎక్స్‌రోడ్‌ వద్ద ఎంపీ వంశీకృష్ణకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఇందారం ఎక్స్‌రోడ్‌ నుంచి మంచిర్యాల వరకు భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బైక్‌లపై ర్యాలీగా మంచిర్యాలకు చేరుకుని రైల్వే స్టేషన్ కాక వెంకట్ స్వామి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి అనంతరం ఐబీ వద్దకు చేరుకున్నారు. అంబేద్కర్ కి పూలవేసి అంబేద్కర్ స్మరించుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేయాలని వంశీకృష్ణకు తెలిపారు అదే విధంగా మంతెన జగన్‌మోహన్‌రావు వర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్పొరేట్లలు. కౌన్సిలర్లు యువత కాంగ్రెస్ పార్టీని మంచిర్యాల్ జిల్లాలో బలోపేతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలలో ఎంపీ. గడ్డం వంశీకృష్ణ. కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంతెన జగన్ మోహన్ రావు. మంచిర్యాల్ జిల్లా కార్పొరేటర్లు నస్పూర్ లక్షెట్టిపేట మున్సిపాలిటీ కౌన్సిలర్స్ 13 వ వార్డ్ కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ. 7వ వార్డ్ బోడ రాజు. రాయలింగు అమీర్ ఖాన్. రంజిత్ సింగ్. కత్తెరపాక రాకేష్ దండేపెల్లి సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.