POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 12:08 pm Posted by : POLITICAL POWER

యజమాని వెంకన్న మృతి చితి వరకు శునకం తోడుగా

 

 సెప్టెంబర్ 20:  పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం వెలగనూరు గ్రామంలో యజమాని చనిపోతే ఓ శునకం అంతిమయాత్రలో పాల్గొనడం విశ్వాసానికి మారుపేరుగా నిరూపించింది. వెలుగనూరు గ్రామానికి చెందిన పెట్టం వెంకన్న అనారోగ్యంతో మృతి చెందారు. కొన్ని ఏళ్లగా ఒక కుక్కని పెంచుకుంటున్నారు. వెంకన్న చనిపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆదివారం అంతిమయాత్ర నిర్వహించగా స్మశానం వాటిక వరకు వెళ్లి చితి చుట్టూ తిరగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.