దుబాయిలో ఘనంగా వినాయక ఉత్సవాలు
పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
దేశం గాని దేశం పరాయి ఎడారి దేశంలో కూడా మతాలకు అతీతంగా, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తు వైభవోపేతంగా తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి -TGWWC కార్మికులు వినాయక ఉత్సవాలను గత సంవత్సరల లాగే నిర్వహించి .వినాయడుకి ఐదు రోజలపాటు పూజలు మరియు భజనలు చేసి శనివారం సాయంత్రం నిమజ్జనం చేయండం జరిగిందని వ్యవస్థాపక అధ్యక్షులు “కల్లెడ భూమయ్య” అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు అయినా ఇప్పటికీ గల్ఫ్ కార్మికులకు ప్రభుత్వలు ఇచ్చిన హామీ నిలబెట్టు కోపోతున్నాయి అని, మరియు ఏప్రిల్ 16, 2024 హైదరాబాద్ లో దక్కన్ హెూటల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి హెూదా లో శ్రీ రేవంత్ రెడ్డి గారు మా గల్ఫ్ సంఘాల సమావేశంలో ఇచ్చిన మాట “గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్” ఎర్పాటుకు ఇచ్చిన మాటకు సానుకూలంగా ఉండేలా మరియు గల్ఫ్ లో చనిపోయిన మిగతా గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చేలా, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసు వచ్చేలా అలాగే గల్ఫ్ కార్మికులు ప్రజలందరూ బాగుండాలని ఆ విఘ్నేశ్వరుని కోరు కోవడం జరిగింది అని అన్నారు. ఇస్లామిక్ దేశంలో కూడా హిందూ పండుగలకు ఇక్కడి ప్రభుత్వం సానుకూలంగా ఉండటం చాలా సంతోషమని యూఏఈ దుబాయ్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారు దుబాయ్ నుండి శరవాణి ద్వారా తెలిపారు. ఈ పూజా కార్యక్రమలలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్యక్షులు కల్లెడ భూమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అలీమ్,కడం మండల ఇంచార్జ్ ధర్మాజీ సత్తన్న, జుంబర్తి గంగాధర్, కోఆర్డినేటర్ కునారపు రమేష్, కరుణాకరణ్, మనోజ్, తిరుపతి, నరసయ్య, రాజన్న సాయి నారాయణ, నవీన్ కుమార్, విజయ్ నరేష్ మణికంఠ శ్రీనివాస్ సత్తన్న నంబయ్య,రామన్న, శశి రణధీర్, భినేష్, రాజేందర్ శ్రీధర్ వివిద జిల్లాల రాష్ట్రాలవారీగా ఏర్పాటు,భక్తులు కార్మికులు పాల్గొన్నారు.
