ఎలకపల్లిలో ఘనంగా తెలంగాణ ఉద్యమకారుల వేదిక (TUV) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం కొత్తగూడెం / పెంచికల్‌పేట్: సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్‌పేట్ మండలం ఎలకపల్లి గ్రామంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం అట్టహాసంగా, విజయవంతంగా నిర్వహించారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైనప్పటికీ, వందల కిలోమీటర్ల దూరం నుండి ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కళాకారుల ధూమ్‌ధామ్‌, ఆటపాటలతో ఎలకపల్లి గ్రామం మార్మోగింది. టీయూవీ వర్కింగ్ ప్రెసిడెంట్ లహన్ రాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి సంస్థ రాష్ట్ర చైర్మన్ నరాల...