POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 11:46 am Posted by : POLITICAL POWER

కమల నగర్ కాలనీ (ఎంకెబిర్)లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

మేడిపల్లి: 22 సెప్టెంబర్ (పొలిటికల్ పవర్ న్యూస్) ఉపేందర్ కూరెళ్ళ

మేడిపల్లి కమలానగర్ కాలనీలో 9వ రోజు వినాయకుని నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. కూరెళ్ళ అనిత ఉపేందర్ దంపతులు పూజలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ గణనాథుడు అందరికీ విఘ్నాలను తొలగించి, విజయాలను చేకూర్చే ఆ వినాయకుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ… వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పడాల బాలరాజు మాట్లాడుతూ బుద్ధిని, సిద్ధిని ప్రసాదించే లంబోదరుని పూజతో కాలనీ వారికి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు నిండాలని ఆశిస్తున్నాను. తొలి పూజలందుకునే పార్వతీ పరమేశ్వరుడు మీ సంకల్పాలన్నింటినీ నెరవేర్చి, మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలి.సులభమైన మరియు స్పష్టమైన విఘ్నేశ్వరుని పూజ – సకల శుభాలకు మూలం. గణనాథుని ఆశీస్సులతో మీరు చేపట్టే ప్రతి కార్యం విజయవంతం కావాలని కోరుకుంటూను.సకల గణాలకు అధిపతి అయిన ఆ గణేశుని అనుగ్రహ అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి ప్రతాప్ రెడ్డి, గుత్తికొండ వెంకటేష్ ,నిరంజన్, వెంకటేష్ గౌడ్,పగడాల బాలరాజు, వరికల శ్రీనివాసు, శంకరాచారి, విష్ణుదాస్ రాధా కిషన్ రావు, కిరణ్ నాయక్, నరేందర్ రెడ్డి, మాణిక్ రెడ్డి, యాదయ్య, లచ్యా నాయక్, శ్రీనివాస చారి, హరి క్రిష్ణ,సూరజ్ తదితరులు కాలనీ మహిళా మణులు పాల్గొన్నారు.