‘ప్యారడైజ్’లో కేసీఆర్ పాత్రలో జీవించావు.. ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు

సెప్టెంబర్ 30: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్
ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ సినిమాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించారని హరీశ్ రావు ప్రశంసించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. తెలంగాణ యాస, పల్లె కథలను సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న ప్రియదర్శి ప్రతిభను అభినందించారు. మల్లేశం’, ‘బలగం’ సినిమాల ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలు, పల్లె సంస్కృతి, కుటుంబ బంధాలను చాటిచెప్పారని హరీశ్ రావు గుర్తుచేశారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని ఆకాంక్షించారు.