‘ప్యారడైజ్’లో కేసీఆర్ పాత్రలో జీవించావు.. ప్రియదర్శిని అభినందించిన హరీశ్ రావు సెప్టెంబర్ 30: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్ ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ‘ప్యారడైజ్’ సినిమాలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రలో ప్రియదర్శి అద్భుతంగా నటించారని హరీశ్ రావు ప్రశంసించారు. కేసీఆర్ హావభావాలు, నడక, మాట తీరును సహజంగా పండించారని కొనియాడారు. తెలంగాణ యాస, పల్లె కథలను...