POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 8:31 pm Posted by : POLITICAL POWER

వాచ్‌మెన్‌గా వచ్చి చిన్నారిని హత్య చేయడం దారుణం: ఎంపీ ఈటల రాజేందర్

అక్టోబర్ 11: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి లేబర్లు, డ్రైవర్లు, వాచ్‌మెన్‌లుగా పనిచేస్తున్న కొందరు మత్తు పదార్థాలకు బానిసై నేరాలకు పాల్పడుతున్నారని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆదివారం అన్నారు. బీహార్‌కు చెందిన వాచ్‌మెన్ డ్రగ్స్‌కు బానిసై ఐదేళ్ల చిన్నారిని హత్య చేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కల్పించే మ్యాన్‌పవర్ ఏజెన్సీలు వారి ప్రవర్తనను పర్యవేక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు.