అంబేద్కర్ విగ్రహం చుట్టూ చెత్త
పట్టించుకోని మున్సిపల్ అధికారులు

అక్టోబర్ 23: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ ప్రతినిది సతీష్
లక్సెట్టిపేట చౌరస్తా వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ క్రింద చెత్తా,చెదారం పేరుకుపోయి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణ లు వ్యక్తం అవుతున్నాయి. చెత్త తో పాటు గ్రిల్స్ ఏర్పాటు చేసిన గోడలకు పోస్టర్లు కూడా అంటిస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని వినియోగదారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, అడ్వకేట్ రెడ్డి మల్ల ప్రకాశం విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతనే పట్టించుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.