POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 October 2026, 1:19 pm Posted by : POLITICAL POWER

అనారోగ్యంతో యువకుని ఆత్మహత్య

అక్టోబర్ 28 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్ గ్రామానికి చెందిన తిప్పని శేఖర్ అనే 28 సంవత్సరాల యువకుడు అనారోగ్య కారణంగా పురులమందు సేవించి ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు తన గ్రామంలోని జిపి కార్యాలయంలో ఎలక్ట్రిషన్ గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో అవస్థ పడుతుండు ఆసుపత్రుల్లో చూయించుకొని మందులు వాడుతుండు తను ఇంత చిన్న వయసులో ఇన్ని ఆరోగ్య కారణాలేంటి అంటూ మనస్థాపం చెంది ఈనెల 23న ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో రాత్రి పంట కొట్టే పురుల మందు సేవించాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కరీంనగర్ ఆసుపత్రిలో నిన్న సాయంత్రం మృతి చెందాడు. మృతునికి ఇంకా పెళ్లి కాలేదు మృతుని తల్లి తిప్పని వజ్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం జరుగుతుంది అని ఎస్ఐ గోపతి సురేష్ తెలిపారు.