అశ్వారావుపేట 15వ వార్డులో అభివృద్ధికి మరో ముందడుగు!

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 28)
గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం.. కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టిన కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి, సీనియర్ నాయకులు సూరిబాబు!
అశ్వారావుపేట: పట్టణ అభివృద్ధిలో భాగంగా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డు గౌడ బజార్‌లో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన ఈ పనులకు 15వ వార్డు కౌన్సిలర్ మోర్ల రాజేశ్వరి (భర్త వెంకన్న), పార్టీ సీనియర్ నాయకులు సూరిబాబు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం!గౌడ బజార్ ప్రాంతంలో రహదారి అభివృద్ధికి చేపట్టిన సీసీ రోడ్డు పనులతో స్థానికుల రాకపోకలకు మరింత సౌలభ్యం కలగనుంది. వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ పనులు దోహదపడనున్నాయి. ప్రజల అవసరాలకు అనుగుణంగా రహదారి సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరేపల్లి వేణుగోపాలకృష్ణ, ఆరేపల్లి నరేష్, తాళం మణికంఠ, పలగాని మురళి తదితరులు పాల్గొన్నారు. గౌడ బజార్‌లో సీసీ రోడ్డు పనుల ప్రారంభంతో 15వ వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో అడుగు పడింది.

