జైపూర్ లో పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాళ్ళో రక్త దానం చేసిన రామారావు పేట సర్పంచ్ పులి రాజశేఖర్

అక్టోబర్ 28: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి
రక్తదానం ప్రణధానం తో సమానం ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలి :సి పి అంబర్ కిషోర్ ఝా పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ జైపూర్ పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జ మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ తో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా గారు రక్తదానం చేసిన ఎస్ఐ భూమేష్ , పోలీస్ అధికారులు, గ్రామ సర్పంచ్‌తో పాటు పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం సమాజానికి ఎంతో మేలు చేసే గొప్ప సేవా కార్యక్రమమని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించిన రక్తం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. రక్తదానంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకుని, అవసరమైన సందర్భాల్లోనే కాకుండా ఆరోగ్యపరంగా అర్హులైన వారు క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జైపూర్ ఎ సి పి వెంకటేశ్వర్లు, జైపూర్ సిఐ నవీన్ కుమార్ ఎస్సై భూమేష్ ప్రజా ప్రతినిధులు యువకులు పాల్గొన్నారు.