POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 3:28 pm Posted by : POLITICAL POWER

బాస్ ఇస్ బ్యాక్ … మళ్లీ రంగంలోకి జూపల్లి రమేష్ బాబు!

 

* బాస్ ఇస్ బ్యాక్… మళ్లీ ప్రజాక్షేత్రంలోకి!

 

* బాస్ ఇస్ బ్యాక్ … అభివృద్ధి బాటలో జూపల్లి రమేష్ బాబు అడుగులు!

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ అక్టోబర్ 30)

*అశ్వారావుపేట అభివృద్ధి పనులపై ఫోకస్… విదేశీ పర్యటన ముగిసింది, ఇక పట్టణ పనులే లక్ష్యం!

అశ్వారావుపేట: విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన జూపల్లి దంపతులు మళ్లీ అశ్వారావుపేట మున్సిపల్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ముఖ్యంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యలు, వార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బాస్ ఇస్ బ్యాక్ … అంటూ రాజకీయ, పట్టణ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. పదవులు అలంకారం కోసం కాదు.. ప్రజలకు సేవ చేసే బాధ్యతగా భావించి ముందుకు సాగాలనే దిశలో ఆయన అడుగులు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు పట్టణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే అశ్వారావుపేట మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల అమలు, రేషన్ కార్డుల పంపిణీ, పట్టణాభివృద్ధికి సంబంధించిన కౌన్సిల్ నిర్ణయాలు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. తాజా పరిణామాల నేపథ్యంలో పెండింగ్ సమస్యల పరిష్కారం, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, డ్రైనేజీ వంటి అంశాలపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వామ్యం… అభివృద్ధి అవసరాలపై ప్రత్యేక దృష్టి:

ఒకవైపు రేషన్ కార్డుల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయానికి స్థల పరిశీలన వంటి అభివృద్ధి అంశాలు అశ్వారావుపేటలో చర్చకు వస్తున్నాయి.

ప్రజా సమస్యలు, పట్టణ అభివృద్ధి అంశాలపై మరింత చొరవ చూపుతూ ముందుకు సాగుతారా? అన్నది ఇప్పుడు పట్టణ ప్రజల్లో ఆసక్తికరంగా మారింది. ప్రజల అంచనాలు పెరిగాయి… బాధ్యత మరింత పెరిగింది: అభివృద్ధి పనుల్లో వేగం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం, సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం వంటి అంశాలే ఇకపై ఆయన పనితీరుకు కొలమానాలు కానున్నాయి. అశ్వారావుపేట పట్టణ అభివృద్ధిలో జూపల్లి రమేష్ బాబు తదుపరి అడుగులు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి.