హైదరాబాద్ బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన 13 ఏళ్ల బాలిక గూడ రోహిత అవయవాలను దానం చేసి, ఆమె కుటుంబ సభ్యులు ఆరుగురి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. కూకట్పల్లి ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కన్నబిడ్డను కోల్పోయిన తీరని శోకంలోనూ, అవయవదానానికి ముందుకు వచ్చిన తండ్రి నారాయణరావు గారి ఔదార్యం నన్ను ఎంతగానో కదిలించింది. తాను తనువు చాలిస్తూ కూడా ఆరుగురికి పునర్జన్మనిచ్చి అమరజీవిగా నిలిచిన చిన్నారి రోహిత త్యాగం సమాజానికి ఎంతో...