సీఈఐఆర్ పోర్టల్‌తో పోగొట్టుకున్న మొబైల్ రికవరీ

బాధితుడికి ఫోన్ తిరిగి అందజేసిన అశ్వారావుపేట పోలీసులు
పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 01)
అశ్వారావుపేట: పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను సీఈఐఆర్ ( – సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా రికవరీ చేసి బాధితుడికి తిరిగి అందజేసి అశ్వారావుపేట పోలీసులు అభినందనలు అందుకున్నారు. గత సెప్టెంబర్ 20న అశ్వారావుపేట పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన దాసరి అబ్రహం, తండ్రి రాములు, తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకున్నారు. ఈ విషయమై బాధితుడు అశ్వారావుపేట పోలీసులను సంప్రదించగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్‌ను గుర్తించి రికవరీ చేశారు. రికవరీ చేసిన మొబైల్ ఫోన్‌ను ఈరోజు బాధితుడు దాసరి అబ్రహంకు తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న ఫోన్‌ను తిరిగి అందించిన పోలీసులకు బాధితుడు కృతజ్ఞతలు తెలిపారు.
.

