POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 November 2026, 2:32 pm Posted by : POLITICAL POWER

లక్షెట్టిపేట పట్టణ ప్రజలకు మరింత చేరువలో వైద్య సేవలు..

నవంబర్ 7 : పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ (MedPlus) ఫార్మసీను ప్రారంభించిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మెడ్‌ప్లస్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు నాణ్యమైన మందులు, మెరుగైన ఫార్మసీ సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట్ మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి-నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరు రాజేశ్వరి- వెంకటస్వామి గౌడ్, కౌన్సిలర్లు,కో-ఆప్షన్ సభ్యులు, నాయకులు,మెడ్‌ప్లస్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు..