POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 3:42 pm Posted by : POLITICAL POWER

పేదల ఇంటికి పెన్షన్ వెలుగులు.. సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం

 

*ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం.. అర్హులకు పెన్షన్ భరోసా!

 

*అశ్వారావుపేటలో నూతన పెన్షన్ల పంపిణీ.. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

 

పేదల సంక్షేమమే లక్ష్యం.. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా కృషి

 

 

పొలిటికల్ పవర్ న్యూస్ అశ్వారావుపేట టౌన్ రిపోర్టర్ (వడితే గణేష్ నవంబర్ 13)

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట:

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పిస్తూ నూతన పెన్షన్ల మంజూరుకు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో అశ్వారావుపేట మండలానికి చెందిన నూతన పెన్షన్ లబ్ధిదారులకు ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి పెన్షన్ మంజూరు పత్రాలను ఎమ్మెల్యే జారె ఆదినారాయణ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

 

ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యే నిరుపేదలకు పెన్షన్ ఒక ఆర్థిక భరోసా అని, వారి నిత్యావసరాలకు ఈ సాయం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

 

సంక్షేమ పాలనకు మరో నిదర్శనం:

 

ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ సాయం నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఊరటనివ్వడంతో పాటు సామాజిక భద్రతకు భరోసాగా నిలుస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

 

పాల్గొన్న ప్రముఖులు:

 

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నంశెట్టి సత్యనారాయణ, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మద్దిశెట్టి జ్యోతి, అశ్వారావుపేట మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, జిల్లా పీసీసీ సభ్యుడు తుమ్మా రాంబాబు, గ్రామపంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.