POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 10:08 am Posted by : POLITICAL POWER

TUWJ-IJU మంచిర్యాల జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఓరగంటి సత్యనారాయణ ఏకగ్రీవ ఎన్నిక

నవంబర్ 14: పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో కూశనపెల్లి సతీష్

మంచిర్యాల: తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (T.U.W.J.-IJU) మంచిర్యాల జిల్లా ఎన్నికలు శుక్రవారం మంచిర్యాల జీలకేంద్రంలోని ఎం కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు ఈ ఎన్నికల్లో కార్యవర్గ సభ్యుడిగా ఓరగంటి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఓరగంటి సత్యనారాయణ ను పలువురు జర్నలిస్టు మిత్రులు, అభినందనలు, తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న యూనియన్ నాయకులకు, సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.