మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ ఇంచార్జ్ ఏ. పాండు రంగా రావు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కీసర సర్కిల్ : జవహర్ నగర్ : జవహర్ నగర్ లో వినాయక నగర్ కాలనీలో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులతో ఐదవ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కమిటీ సభ్యులందరూ కలిసి స్వామి వారి హుండీ ఆదాయాన్ని లెక్కించడం జరిగింది. అలాగే 01 సెప్టెంబర్ 2026, మంగళవారం రోజున శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఐదవ వ వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది.ఈ పవిత్ర కార్యక్రమంలో కమిటీ సభ్యులందరూ తమ వంతు సహకారంగా ఒక్కొక్కరు రూపాయలు 5,000 చొప్పున విరాళంగా అందించేందుకు ముందుకు రావడం ఎంతో అభినందనీయం.
కాలనీ ఐక్యతే మన బలం…
మన భక్తియే మన శక్తి…
మన సేవే స్వామివారికి నిజమైన కానుక అంటు
అధ్యక్షులు మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక స్వామి వారి కృపతో ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖశాంతులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…
గణపతి బప్పా మోరియా…
మంగళమూర్తి మోరియా అంటు కోరుకున్నారు. మాజీ కార్పొరేటర్ మరియు ఉపాధ్యక్షులు మునిగల సతీష్ కుమార్ మాట్లాడుతూ విఘ్నాలను తొలగించి, సకల శుభాలను ప్రసాదించేస్వామి వారిని స్మరించుకున్నారు. ఇట్టి కార్యక్రమంమం లో కమిటీ సభ్యులు ప్రధాన కార్యదర్శి నరేందర్, చంద్రశేఖర కోశాధికారి,
జాయింట్ సెక్రటరీ శేఖర్ చారి కమిటీ సభ్యులు సంతోష్ యాదవ్, గంగారం
శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కాలనీ ప్రజలు ప్రార్థిస్తున్నారు .